telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిరుత్సాహంగా.. ఆర్బీఐ వార్షిక నివేదిక.. ప్రైవేటీకరణ తప్పదంటూ..

RBI

దేశఅత్యున్నత బ్యాంకు ఆర్బీఐ తన వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు ఉన్న నిధుల వివరాలను వార్షిక నివేదికలో పొందుపర్చింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేశాకా జూన్ 30, 2019 నాటికి ఉన్న మిగులు బ్యాలెన్స్ రూ.1,96,344 కోట్లుగా ఉందని స్పష్టం చేసింది. 2018 జూన్ 30 నాటికి అది 2,32,108 కోట్లుగా ఉన్నిందని నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసిన రూ.1.76 లక్షల కోట్లలో రూ. 1,23,414 కోట్లు 2018-19లో వచ్చిన లాభాల్లో నుంచి మిగులు నగదును ఆర్బీఐ బదిలీ చేసింది. మరో రూ.52,637 కోట్లు ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ కింద ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ అన్ని క్యాల్కులేషన్స్ చేశాక రూ.21,464 కోట్లు మేరా అత్యవసర నిధులు తగ్గాయని వార్షిక నివేదికలో పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరంలో రూ .50,880 కోట్ల నుంచి దేశీయ వనరుల ఆదాయం 132.07 శాతం పెరిగి రూ .1,18,078 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఆదాయం పెరగడం వెనుక కారణాలు చెబుతూ, రూపాయి సెక్యూరిటీల పోర్ట్‌ఫోలియో పెరగడం, లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ కింద వడ్డీపై నికర ఆదాయం, కాంటింజెన్సీ ఫండ్ నుంచి అదనపు రిస్క్ కేటాయింపులు కారణమని ఆర్బీఐ తెలిపింది. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్బీఐ వెల్లడించింది. ఐఎల్ మరియు ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి వాణిజ్య రంగంలోకి రుణాలు రావడం 20శాతానికి పడిపోయినట్లు ఆర్బీఐ వెల్లడించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్‌లో సంక్షోభం కారణంగా దేశంలో నగదు నిల్వ లేకుండా పోతోందని ఇది ప్రైవేట్ పెట్టుబడులకు అడ్డంకిగా మారిందని పేర్కొంది.

2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో 6801 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్న ఆర్బీఐ… ఇందులో మొత్తం రూ. 71,542.93 కోట్లు మేరా నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చింది. అదే 2017-18లో 5916 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయని ఆ సమయంలో రూ.41,167.04 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించింది. ఆర్థికాభివృద్ధి జరగాలంటే బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర రంగాలను బలపర్చాలని పేర్కొంది. అంతేకాదు మానవవనరుల రంగాన్ని ఆదుకోవాలని కార్మిక చట్టాల్లో, పన్ను విధానాల్లో సంస్కరణలు తీసుకురావాలని సూచించింది.ఇక ఆర్థికాభివృద్ధి కోసం ఆర్బీఐ ముఖ్యమైన రేట్లను 2019లో 1.10 శాతంకు కట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రైతు రుణ మాఫీలు, సెవెన్త్ పే కమిషన్ నివేదిక అమలు, ఇతర ఆదాయ పథకాలు అమలు చేయడంతో ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా పుంజుకోలేకపోతున్నాయని పేర్కొంది.

Related posts