telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వేడెక్కిన ఏపీ రాజకీయాలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్…

శ్రీకాకుళం : మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత కూనరవికుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. పాత్రుని వలసలోని కోవిడ్ కేర్ సెంటర్ పరిశీలనకు కూన రవికుమార్ పిలుపునిచ్చారు. ఏ నేపథ్యంలో.. కూనరవికుమార్ ను బయటికి వెళ్లడానికి వీల్లేదంటూ సూచించిన పోలీసులు.. హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన కూనరవికుమార్..తమ హక్కులను కాలరాస్తున్నారంటూ పోలీసులపై కూన రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అటు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులను పరామర్శకు వెళుతున్న అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది ఇలా ఉండగా.. బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేసిన ఘటనలో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Related posts