telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట: సంగం డెయిరీ కేసులో బెయిల్ …

టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రకు ఏపీ హై కోర్టులో ఊరట లభించింది. దూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‎కు బెయిల్ మంజూరు అయింది. నెల రోజుల క్రితం సంగం డైరీ కేసులో నరేంద్రను అరెస్ట్ చేసిన ఏసీబీ… ప్రస్తుతం రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దూళిపాళ్ల. అయితే ఇవాళ.. సంగం డెయిరీలో అవకతవకలు కేసులో A1 ముద్దాయి ధూళిపాళ్ళ నరేంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల పాటు ధూళిపాళ్ళ నరేంద్ర విజయవాడలోనే ఉండాలని..విజయవాడలో ఎక్కడ ఉంటున్నారో ఇంటి అడ్రస్ కోర్టుకు తెలుపాలని హై కోర్టు షరతులు పెట్టింది. అంతే కాదు.. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించాలని ధూళిపాళ్ళ నరేంద్రను ఆదేశించింది. ఏసీబీ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని.. ధూళిపాళ్లను విచారించాలంటే 24 గంటల ముందు ఏసీబీ నోటీసులు ఇవ్వాలని హైకోర్ట్ పేర్కొంది. కాగా.. సంగం డైరీలో అవకతవలపై ఏప్రిల్ 23న ధూళిపాళ్లను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ధూళిపాళ్లతోపాటు డైరీ ఎండీ గోపాలకృష్ణ, సహకార శాఖ అధికారి గుర్నాధంను అరెస్ట్ చేసింది ఏసీబీ.

 

Related posts