సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కోవిడ్ కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. కుటుంబంలో అందరికి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా ఇటీవల చెప్పిన ఆయన వీలైనంత త్వరగా అందరం కొలుకుంటామని చెప్పారు. అయితే ఇటీవల శివాత్మిక తన తన తండ్రి ఆరోగ్య పరిస్థితి కాస్తా కష్టంగానే ఉందని ట్వీట్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శివాత్మిక చేసిన ట్వీట్‌కు చిరంజీవి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. డియర్ శివాత్మిక .. మీ నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అందరి ప్రార్ధనలతో రాజశేఖర్ త్వరగా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తన తండ్రి ఆరోగ్యం గురించి ట్వీట్ చేసిన శివాత్మిక.. నా తండ్రి కరోనాతో ధైర్యంగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తార`ని శివాత్మిక పేర్కొంది.
previous post