లోక్ సభ సమావేశాలలో టీడీపీ నాయకుడు శివప్రసాద్ విచిత్ర వేషధారణలతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే. దీనికై ఆయన రోజుకు ఒక వేషంలో సభకు హాజరై, సభా స్థలిలో ఇతర టీడీపీ నాయకులతో కలిసి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరిగిన సమావేశాలలో ఆయన తో సహా పలువురిని స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్ సభలో ఈరోజు చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణ తరహాలోనే ఏపీ ప్రజలు సైతం టీడీపీకి ఎన్నికల్లో బుద్ధి చెబుతారని దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా పేరుతో టీడీపీ సభ్యులు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో కేంద్ర మంత్రి గోయల్ విమర్శలను నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి కావేరీ నదీ జలాల వివాదంపై ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులు తోడయ్యారు. టీడీపీ సభ్యుడు శివప్రసాద్, మరో ముగ్గురు అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ శివప్రసాద్ తో పాటు ముగ్గురు అన్నాడీఎంకే సభ్యులను సస్పెండ్ చేశారు.
టీడీపీకి కార్యకర్తలే కొండంత బలం: బాలకృష్ణ