వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా దొంగ ఓటు వేశాడంటూ ఆరోపిస్తున్నారు. అమెరికాలో పైలెట్ శిక్షణ పొందిన రోహిత్ రెడ్డి. మన దేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, మరి ఇక్కడ అర్హత లేని చదువుతో ఓటు వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ది కూడా దొంగ ఓటేనని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు శాసనసభ స్పీకర్ దృష్టి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అయితే ఇప్పటికే అక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న వ్యవహారం దుమారం రేగుతుంది. అయితే దొంగ ఓట్లు వేసిన తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు..అధికారులను ప్రలోభాలకు గురి చేయడంతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారని విమర్శించారు. ఆమె దొంగ ఓటు వేయడం నేరం అని స్వప్నపై కఠిన చర్యలు తీసుకొవాలని అన్నారు.
previous post
next post