telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దొంగ బాబా తాట తీయండి..ఎమ్మెల్సీ కవిత సీరియస్

kavitha trs

నిజామాబాద్ లో వైద్యం పేరుతో లైంగికదాడికి పాల్పడ్డ దొంగ బాబాపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. లైంగికదాడికి పాల్పడ్డ దొంగ బాబాను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు. బాలికను వైద్యం పేరిట మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టి తల్లిని చేసిన కర్కోటకుడికి బుద్ది వచ్చేలా చేయాలని కవిత అన్నారు. కాగా, దొంగబాబా చేతిలో లైంగికదాడికి పాల్పడ్డ బాధితురాలిని నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సుమనా రెడ్డి పరామర్శించారు.

ఎం.ఎల్.సి కవిత ఆదేశాలతో బాధితురాలికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అన్నివిధాలా అండగా నిలుస్తామని బాధితురాలి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలన్నారు. కాగా..పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కావడంతో తీవ్ర ఆగ్రహంతో బాలిక తల్లిదండ్రులు, మహిళా సంఘాలు దొంగబాబాపై దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts