telugu navyamedia
రాజకీయ వార్తలు

లడఖ్ లో తీవ్ర ఉద్రిక్తత.. రాజ్ నాథ్ అత్యవసర సమావేశం

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. లడఖ్ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత జవాన్లు మరణించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లడఖ్ గాల్వన్ లోయలో ఓ అధికారి, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. సైనికాధికారి సహా ముగ్గురు మరణించడంతో భారత్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులను కూడా హుటాహుటిన పిలిపించారు. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై తీవ్రంగా చర్చించారు.

Related posts