తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది. కానీ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ప్రారంభంలో కారు స్పీడ్ అంతగా కనిపించలేదు. టీఆర్ఎస్ గెలుపు కోసం అన్ని ప్రాంతాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించారు.
కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో కారు స్పీడ్‌గా దూసుకుపోతోంది. సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ సత్తా చాటలేకపోయారు. మొదటి, రెండు రౌండ్లలో 35 వార్డులకుగానూ టీఆర్‌ఎస్-5, రెండేసి చోట్ల కాంగ్రెస్, బీజేపీ గెలుపొందాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. మిగతా రౌండ్లలో కారు స్పీడ్ పెరుగుతుందేమో వేచి చూడాలి.