telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించక తప్పదు…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం మైఖేల్‌ వాన్‌ రెండు ట్వీట్లు చేశాడు. ‘భారత జట్టుకు ఇదొక గుణపాఠం కావాలి. 40 ఓవర్లపాటు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడం చూస్తుంటే.. రానున్న రెండేళ్లలో స్వదేశంలో జరుగనున్న 2023 ప్రపంచకప్‌లో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితే వస్తుందేమో.. ఫ్లాట్‌ వికెట్లపై 375+ స్కోరు నమోదు చేయగల సత్తా వారికి ఉంది. కానీ వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అదే సమయంలో ఇంగ్లండ్‌ ఈ సూత్రాన్ని పాటిస్తూ ముందుకు సాగింది’ అని వాన్‌ అన్నాడు. టీమిండియా బౌలింగ్‌ గురించి మైఖేల్‌ వాన్‌ మాట్లాడుతూ… అసలు భారత్ బౌలింగ్‌ విధానాలేంటి అలా ఉన్నాయి. ఈసారి విరాట్ కోహ్లీ అత్యుత్తమ బౌలర్లను ప్రయోగించాలి. వెరీ పూర్‌ కెప్టెన్సీ’ అంటూ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తీరును విమర్శించాడు.

Related posts