telugu navyamedia
సినిమా వార్తలు

ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది..

అక్కినేని నాగచైతన్య న‌టిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’ . విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్‌ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22నరిలీజ్ కానుంది. దీంతో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్ . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాట‌లు, టీజర్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా సినిమా ట్రైలర్ ను విడుద‌ల చేశారు. అన్ని ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. ‘మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరుకున్న గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

ఫ్లైల్ట్‌ ఎక్క‌డ‌మే ఫ‌స్ట్ టైమ్‌..చిన్న‌ప్పుడంతా నారాయ‌ణ‌పురంలో ..’ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది’ అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.

డిఫరెంట్ స్టేజెస్ లో హీరో లైఫ్ జర్నీను ట్రైలర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

Related posts