సాయి ధర్మతేజ్ దర్శకుడు మారుతి తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రతి రోజు పండగే అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తుంది. రీసెంట్‌గా సాయిధరమ్ తేజ్ లొకేషన్‌లో అడుగుపెట్టాడు.
తేజూపై కీలక సన్నివేశాలని మారుతి తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇందులో సరికొత్త లుక్‌లో తేజూ కనిపించనుండగా, ఈ మూవీ ప్రేక్షకులకి పసందైన విందు అందించడం ఖాయమని అంటున్నారు. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలపడం విశేషం.