సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు మంచి ఉద్యోగం, తగినంత జీతమున్నప్పటికీ పలు కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ గా పని చేస్తున్న మహతి (28) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ మదీనాగూడలో ల్యాండ్ మార్క్ అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఆమె… అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
నిన్న ఉదయం తన అక్కతో కలసి కారులో బయటకు వెళ్లి మహతి తిరిగి వచ్చింది. అక్కను కారులోనే ఉండమని చెప్పి… తాను అపార్ట్ మెట్ పైకి వెళ్లి ఐదో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయమైంది. హుటాహుటిన ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి: డీకే అరుణ