తాజాగా, మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. జార్ఖండ్‌లోని సరాయికేళ జిల్లాలో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ బెంగాల్ సరిహద్దులో జంషెడ్‌పూర్‌కు 40 కి.మీ. దూరంలోని స్థానిక మార్కెట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు పోలీసులను ఇద్దరు మావోయిస్టులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వారిపై కాల్పులు జరిపిన అనంతరం ఆయుధాలు తీసుకుని పారిపోయారు.
ఈ ఘటనలో ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని కొల్హన్ డీఐజీ కుల్‌దీప్ ద్వివేది సందర్శించారు. మావోయిస్టులు మృతి చెందిన పోలీసుల వద్ద నుంచి మూడు ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్, రెండు పిస్టోల్స్ ఎత్తుకెళ్లినట్లు డీఐజీ తెలిపారు. పోలీసులతో పాటు వెళ్లిన డ్రైవర్ సురక్షితంగా చేరుకున్నాడని, సంఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అంబుష్ జరిగిన ఏరియాలో బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
కుంతియా అనే ఐరన్‌లెగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం: సర్వే