telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : ఉద్యోగం కావాలంటే.. మాంచి న్యూడ్ పోజ్ పంపించు.. ఓ హెచ్ఆర్

women gang raped in capital of india

అంతటా జరుగుతున్నాయి, నేను చేస్తే ఏమిటవుతుంది గనక అనిపించిందేమో ఈ హెచ్ఆర్ కి.. ఉద్యోగం కోసం వచ్చిన ఓ మహిళను.. నీ నగ్న చిత్రాలను వాట్సాప్‌ చేస్తే వాటిని చూసి, ఆ తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాను.. లేదంటే నీ ఉద్యోగం వేరే వాళ్లకు ఇస్తాను’ అంటూ యువతిని వేధించారు ఇద్దరు నిందితులు. ఆ యువతి వారు చెప్పినట్లే చేసింది. ఉద్యోగం ఇవ్వలేదు సరికదా..! ఆమెను వేధించడం ప్రారంభించారు. చివరకు ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 

మియాపూర్‌కు చెందిన ఒక యువతికి ప్రదీప్‌ అనే యువకుడు ఫోన్‌ చేశాడు. ప్రముఖ హోటల్‌ నుంచి మాట్లాడుతున్నాను. మీకు మా హోటళ్లో రిసెష్షనిస్టు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నామని చెప్పాడు. అందుకు ఆ యువతి నేను దరఖాస్తు చేయలేదు… నా వివరాలు మీకు ఎలా వచ్చాయి అని అడిగింది. అందుకు అతను ఓ వెబ్‌సైట్‌ నుంచి మీ రెజ్యూమ్‌ను సేకరించాము అని చెప్పాడు. దాంతో ఆ యువతి అతని మాటలు నమ్మింది. ఉద్యోగం చేయడానికి ఆ యువతి సిద్ధంగా ఉండటంతో ఆమెను అర్చనాజగదీష్‌ అనే హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ వాట్సప్‌లో ఇంటర్య్వూ చేశారు.

దానితో మీరు మొదటి రౌండ్‌లో సెలెక్ట్‌ అయ్యారని చెప్పారు. అనంతరం నీ నగ్న చిత్రాలు వాట్సాప్‌ చేయాలని కండీషన్‌ పెట్టింది. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. మరోసారి ఫోన్‌ చేసి ఆ ఫొటోలు కేవలం నేను చూసి వెంటనే డిలీట్‌ చేస్తామని నమ్మించింది. లేదంటే నీ ఉద్యోగం వేరే వాళ్లకు ఇస్తాను అని చెప్పడంతో ఉద్యోగం అవసరమున్న ఆ యువతి గత్యంతరం లేక తన నగ్న చిత్రాలను పంపింది. అనంతరం ముందుగా ఉద్యోగం ఇస్తామని ఫోన్‌ చేసిన ప్రదీప్‌ అనే యువకుడు.. ఆ యువతికి ఫోన్‌ చేసి ఆ యువతి పంపిన చిత్రాల గురించి అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. దాని తో మానసిక వేదన అనుభవించిన ఆ యువతి షీటీమ్స్‌ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన సైబరాబాద్‌ షీటీమ్స్‌ బృందం నిందితుల ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.

Related posts