telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క..నా సత్తా ఏంటో చూపిస్తా

*ఇవాళ ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న రోజా
*మంత్రి అయ్యాక తొలిసారి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ళిన రోజా
*ప్రాణం ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న‌న్న వెంటే న‌డుస్తాను
*గ‌జ‌మాల‌తో ఘ‌న‌స్వాగ‌తం పలికిన కార్య‌క‌ర్తలు

*ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క..

మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఆర్‌.కె.రోజా నగరి రావడంతో… వైకాపా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రోజా నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు…‘మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలిసారిగా సోమవారం తన నియోజవర్గం నగరికి విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రోజా పాల్గొన్నారు.

Thumbnail image

నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారు. నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే.. జగనన్న ఊహించని విధంగా మంత్రి ఉన్నత స్థాయి ఇచ్చాడు. రాజకీయంగా నేను ఇద్దరికే రుణపడి ఉన్నాను.. ఒకటి నా నగరి ప్రజలకు, ఇంకొకటి జగనన్నకు మాత్రమే.

నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నగరి అభివృద్ది కోసం పనిచేస్తాను. చివరి రక్తపుబొట్టు వరకు జగనన్న కోసం పని చేస్తాను. జగనన్న నాయకత్వంలో ఒక సైనికురాలిగా పనిచేస్తాను’’ అని రోజా అన్నారు.

AP Tourism Minister Roja comments at huge Rally in Nagari

నిన్నటి వరకు ఇక రోజాకు సీటు రాదని, నా పని అయిపోయిందని ఎగతాళి చేసి మాట్లాడిన వారి నోర్లు మూయించే విధంగా ఇక్కడి ప్రజలు తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించార’న్నారు. ఇన్నిరోజులు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క.. తన సత్తా ఏమిటో చూపిస్తానని పేర్కొన్నారు.

నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని, నా కంఠంలో ప్రాణమున్నంత మీ వెంటే ఉంటానన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. వారి కష్టాలనుతొలగించేందుకు కృషి చేస్తానని తెలిపారు

నగరి ప్రజల ప్రేమను మరువలేనని.. వారికి రుణపడి ఉంటానని చెప్పారు. 2024లోనూ జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, వార్‌ వన్‌ సైడేనని పేర్కొన్నారు.

Related posts