టీడీపీ నేత, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై మరో సారి మండిపడ్డారు. శనివారం విజయవాడలోఆయన మీడియాతో మాట్లాడుతూ మే 23వ తేదీ తర్వాత వైసీపీ దుకాణం బంద్ అవుతుందని అన్నారు. బీజేపీలో వైసీపీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి బీజేపీ అగ్రనేతలతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి జనాల మధ్య ఉండాల్సిన వ్యక్తులు కాదని దేవినేని వ్యాఖ్యానించారు. వచ్చే రిపబ్లిక్ డే నాటికి విజయసాయిరెడ్డి జైల్లో ఉంటారని చెప్పారు. అయితే తీహార్ జైల్లో ఉండాలా? లేక రాజమండ్రి జైల్లో ఉండాలా? అనే విషయాన్ని ఆయనే తేల్చుకోవాలని అన్నారు.
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా