జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, వైసీపీల పై మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తణుకు శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ దుష్ప్రచారాలు చేస్తే ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం నేతలకు మర్యాద దక్కదని పవన్ హెచ్చరించారు. టీడీపీ, వైసీపీలతో కలవాల్సిన దుస్థితిలో జనసేన పార్టీ లేదని అన్నారు. ఇంకా ఆ పార్టీ నాయకులు పనికిమాలిన ప్రచారాలు చేయడంలో అర్థంలేదని అన్నారు.
రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే చంద్రబాబుకు పెన్షన్ ఇచ్చి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని సూచించారు. తాను పక్క ప్రణాళికతోనే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. ఈ ఎన్నికలతో అంతా అయిపోతుందని తాను భావించడం లేదని పవన్ తేల్చి చెప్పారు. ఈ ఎన్నికలు అయిన తర్వాత జైలుకు వెళ్లడానికి తనపై జగన్ లా అక్రమాస్తుల కేసులు లేవన్నారు. చంద్రబాబులా ఓటుకు నోటు కేసు లాంటివి కూడా తన పై లేవని పేర్కొన్నారు.
వైఎస్ వివేకా హత్య పై పార్థసారథి సంచలన వ్యాఖ్యలు…