telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ మేనిఫెస్టో పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

Kishan Reddy

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్బంగా తాజాగా తెరాస పార్టీ తమ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే 2016 కి ఇప్పటి మేనిఫెస్టో కి తేడా లేదు.. అప్పుడు ఏమి చెప్పాడో ఇప్పుడు అవే చెప్పాడు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఏమి చేశారు ఏమి చేస్తారో చెబుతాడు అని భావించాము. పాత వాటినే కొత్త పేపర్ మీద ప్రింట్ చేసి కొత్తగా మాట్లాడారు.. ఫ్రంట్ పేజీ చూస్తేనే డొల్లతనం కనిపిస్తోంది. 2016 లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు అవే రాసారు. ప్రజలకు జ్ఞాపక శక్తి లేదని కేసీఆర్ అనుకుంటున్నాడు అని అన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర పార్టీ ల మీద విరుచుకు పడడం ఆయనకు అలవాటు అని తెలిపారు. సెలూన్లకు ,దోబీ ఘాట్ లకు విద్యుత్ బిలు మినహాయింపు పాతదే. పరిశ్రమ లకు విద్యుత్ బిల్లు రద్దు పాతదే.  తెరాస వారికి మేనిఫెస్టో తయారు కి సమయం లేనట్టుంది.. తెరాస పార్టీ మెట్రో రైల్ కి చేసింది ఏంటో చెప్పాలిఅని ప్రశ్నించాడు. పాత పట్నం ప్రజల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు కేసీఆర్.. మెట్రో రైలు పాత బస్తీకి తీసుకురాని మీకు, ఎంఐఎం  కి ఓట్లు అడిగే హక్కు ఉందా.. అని అడిగారు. మెట్రో రెండో దశకి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వనందుకే ఆగిపోయింది. రీజినల్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం సీఎం చెబితే బాగుండేది అన్నారు. ఆరున్నర సంవత్సరాల్లో పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. ఏ మొఖం పెట్టుకుని ఇప్పుడు ఇస్తా అంటున్నారు అన్నారు.

మతశక్తులు ,విచ్ఛిన్న శక్తుల కు అవకాశం ఇవ్వొద్దని అంటున్నాడు.. దేశానికి దశ దిశా చూపిస్తాడట.. తెలంగాణ కి ఏమి దశ దిశ చూపెట్టావో చెప్పు.. తెలంగాణ ని అప్పుల రాష్ట్రంగా మార్చావ. సంపద సృష్టించే ప్రభుత్వం రావాలని అంటున్నాడు.. 10 వేలు ఇచ్చి అందులో సగం డబ్బులు కార్యకర్తలు తీసుకున్నారు.. ఇలాంటి సంపద సృష్టించాలని అనుకుంటున్నారా… మీరు చేసిన పని మీద మీకు నమ్మకం లేదు.. మీరు ఏమి చేయలేదని ఒప్పుకుంటున్నారు. మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. సీఎం దుబ్బాక బయట సభలు పెట్టి బీజేపీ పై విషం కక్కారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయ్ .. చేతలు ఫార్మ్ హౌస్ దాటవు అని ప్రజలు అనుకున్నారు.  దుబ్బాక లో ఓడించారు.. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నరేంద్ర మోడీ కి బాగా తెలుసు. తెరాస మేనిఫెస్టో నీటిబుడగ.. ప్రజలకు మేలు జరిగేది కాదు అని తెలిపాడు.

Related posts