telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు…

ap high court

మంత్రి పెద్దిరెడ్డిపై నిన్నటి రోజున రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించడం లేదని ఎన్నికల కమిషన్ నిన్నటి రోజున పేర్కొన్నది.  ఈనెల 21 వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం కావాలని, మీడియాతో కూడా మాట్లాడవద్దని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఎన్నికల సంఘం పేర్కొన్నది.  దీనిపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.దీనిపై ఈరోజు ఉదయం విచారణ జరిగింది.  ఫిబ్రవరి 6 వ తేదీన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ముందుగా నోటీసులు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని, ఈరోజు రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం పాల్గొనాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.  అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులో పేర్కొన్నట్టు ఎస్ఈసి న్యాయవాది పేర్కొన్నారు.  ఇరుపక్షాలు సంబంధించిన వాదనలను న్యాయస్థానం విన్నది. అయితే ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసి ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.  పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ కు సంబంధించిన ఆదేశాలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది.  అయితే, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడటంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొన్నది. చూడాలి మరి కోరుతూ తీర్పు పై ఆయన ఎలా స్పందిస్తారు అనేది.

Related posts