telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈబీసీ బిల్లుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు: అరుణ్ జైట్లీ

Arun Jaitely counter terrists attacks

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిల్లుపై లోక్ సభలో చర్చలో మాట్లాడిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బిల్లుకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదన్నారు. రాజ్యాంగ పీఠికలోని సోషలిస్టు అనే పదాన్ని జతచేశారన్న ఆయన మౌలిక స్ఫూర్తిని అడ్డం పెట్టుకొని ఈ బిల్లును అడ్డుకోలేరన్నారు.

దేశంలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి మేలుచేసేందుకే ఈ బిల్లు టీసుకొచ్చామన్నారు. అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్ సమాన అవకాశాల సూత్రానికి రాజ్యాంగంలోనే మినహాయింపులున్నాయన్నారు. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించినందున మరో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడం కోర్టు తీర్పుకు ధిక్కరించినట్లవుతుందన్న వాదన అర్థ అర్థరహితమని జెట్లీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16(4) ప్రకారం సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితి కులాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు.

Related posts