telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

భారీగా తగ్గిన ఉల్లి ధర.. కిలో రూ.30

onions

మొన్నటి వరకు కిలో రూ.200 పలికిన ఉల్లిధర ఇప్పుడు కిలో రూ.30 ధర పలుకుతోంది. నాణ్యతగల ఉల్లిగడ్డలు కూడా కిలో రూ.35 నుంచి రూ.40 వరకు అందుబాటులోకి వచ్చాయి. మామూలు, కాస్త సైజు చిన్నగా ఉంటే రూ.20కి కూడా అమ్ముతున్నారు. దేశంలో ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఏపీల్లోనూ ఉల్లి పంట దిగుబడులు వస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు నేలకు దిగి వచ్చాయి.

సోమవారం హైద్రాబాద్ హోల్ సేల్ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లి ధరలు క్వాలిటీని బట్టి రూ.2000 నుంచి రూ.3000 వరకు పలుకుతున్నాయి. దాంతో రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గాయి. మరోవైపు ఉత్తర భారతదేశంలోని బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఉల్లి ధరలు మండుతూనే ఉన్నాయి. అక్కడ రిటైల్లో ఇప్పటికీ రూ.60, రూ.70 పైనే అమ్ముతున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై భారీగా స్టాక్ ను బ్లాక్ చేయడంతో ధరలు తగ్గడం లేదని అంటున్నారు.

Related posts