telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఎన్టీఆర్ ‘రాఖీ’ కి 14 ఏళ్ళు…

ఎన్టీఆర్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాఖీ’. 2006 లో విడుదలైన ఈ సినిమా నేటితో ఈ సినిమా 14 ఏళ్ళు పూర్తిచేసుకుంది. తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయం మాత్రమే కాక మరేవిధమైనటువంటి అన్యాయమూ మరే ఆడపిల్లకూ జరగకూడదనే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. తన చెల్లె కేసుకు వ్యతిరేకంగా వాదించిన ప్లీడరునూ, దొగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరునూ, పోలీసాపీసరులనూ కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. అక్కడనుండి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేదించినా, బాధించినా వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. ప్రెగ్నెంట్ అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. సినిమా క్లైమాక్స్ లో రాఖీ కోర్టులో మాట్లాడే సీన్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఇలియానా, ఛార్మి హీరోయిన్లుగా నటించారు. రాఖీ సినిమా సిస్టర్ సెంటిమెంట్ కు సంబంధించినదే అయిన ఆమె చుట్టూనే కథ నడిపించకుండా ఇలియానా, ఛార్మిల పాత్రలకు ఎక్కువే ప్రాధాన్యత ఇచ్చారు కృష్ణవంశీ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, డా,కె.ఎల్.నారాయణ నిర్మాతగా రాణించారు. అయితే ఈ సినిమాకు 14 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా దీని #14YearsForRakhi ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.

Related posts