telugu navyamedia
సినిమా వార్తలు

వెంకీ, రవితేజ మల్టీస్టారర్ లేనట్టే…!

Raviteja-and-venkatesh

వెంకటేష్ మల్టీస్టారర్ మూవీలతో దూసుకుపోతున్నారు. మహేష్ బాబుతో కలసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కల్యాణ్ తో కలసి ‘గోపాల గోపాల’, తాజాగా వరుణ్ తేజ్ తో కలసి చేసిన ‘ఎఫ్2’ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని మల్లీస్టారర్ మూవీలు చేసేందుకు వెంకటేష్ మొగ్గు చూపుతున్నారు. దర్శకుడు వీరు పోట్ల వెంకీ కోసం ఓ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేశాడని, ఈ చిత్రంలో వెంకీతో కలసి రవితేజ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. నిర్మాత అనిల్ సుంకరతో వెంకటేష్ ఒక సినిమా చేయాల్సి ఉందట.

అనిల్ సుంకర రిఫరెన్స్ తో దర్శకుడు వీరు పోట్ల ఒక లైన్ ను వెంకటేష్ కి వినిపించాడట. కానీ ఈ విషయంపై వెంకటేష్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇంతలోనే ఇది మల్టీ స్టారర్ అనీ, వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, వెంకీ, రవితేజ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు షికారు చేశాయి. ముందుగా ఇది మల్టీ స్టారర్ కాదనే విషయం స్పష్టమైపోయింది. ఇక వీరు పోట్లకి చెప్పిన కథకు వెంకీ కమిటవ్వడం కష్టమేననే టాక్ కూడా మరోవైపున వినిపిస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలసి వెంకీ ప్రస్తుతం ‘వెంకీ మామ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Related posts