గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు, సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ ఈరోజు కన్ను మూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. నెల్లూరు నగరంలో తిప్పరాజువారి వీధిలో ఉన్న స్వగృహంలో ఆమె మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం ఓ ఛానల్ ప్రోగ్రామ్ విషయమై లండన్ లో ఉన్నారు. తన తల్లి మరణవార్త తెలుసుకున్న ఆయన ఇండియాకు ప్రయాణమయ్యారు. రేపు ఆయన నెల్లూరు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
previous post
అలా హరీష్ శంకర్ హిట్ కొడితే ఇండస్ట్రీ వదిలేస్తా… బండ్ల గణేష్ ఫైర్