telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమితాబ్, చిరు సేవలపై స్పెషల్ పర్ఫార్మెన్స్… తలసాని రిలీజ్ చేసిన కృతజ్ఞతా గీతాలు

chiru

కరోనా మహమ్మారి దాడితో చిన్నాభిన్నమైన సినీ కళాకారుల కోసం నేనున్నా అంటూ ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, చిరంజీవి. కరోనా పట్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా నిలిచారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినీ కార్మికులకు సైతం స్పెషల్‌గా కూపన్స్ ఇచ్చి అమితాబ్ నిత్యావసర సరుకులు కొనివ్వగా, సీసీసీ పేరుతో చిరంజీవి, తలసాని ట్రస్ట్ పేరుతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం అమితాబ్ అదే కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, కష్టకాలంలో సేవలందందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వారు స్పెషల్ వీడియోలు రూపొందించారు. తాజాగా ఈ కృతజ్ఞతాగీతాల ఆవిష్కరణ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా జరిగింది. ఈ గీతాల ద్వారా కరోనా కష్టకాలంలో తమను ఆదుకున్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిలకు ఆటపాటల రూపంలో కృతజ్ఞతలు తెలిపారు తెలుగు ఫిల్మ్ & టివి డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వారు. “డాన్స్ ను నమ్ముకుని జీవిస్తున్న మేము.. కరోనా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకుని, మా పాలిట నడిచే దైవాలుగా నిలిచిన తలసాని, అమితాబ్, చిరంజీవి సార్లకు డాన్స్ రూపంలోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం” అన్నారు యూనియన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ కొమరం వెంకటేష్, సెక్రటరీ పి.ఎస్.ఎన్. దొర, ట్రెజరర్ అనిల్ కుమార్ వల్లభనేని, మనం సైతం కాదంబరి కిరణ్, యూనియన్ జనరల్ సెక్రటరీ పి.ఎం. యాదవ్ ,కోశాధికారి శ్రీనివాసులుతోపాటు.. డాన్స్ యూనియన్ ఫౌండర్స్, నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts