telugu navyamedia
సినిమా వార్తలు

ఆసక్తికరంగా “కల్కి” టీజర్

Kalki

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న చిత్రం “కల్కి”. యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సి.కళ్యాణ్ తో కలిసి రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ రోజున రాజశేఖర్ పుట్టినరోజు… ఈ సందర్భంగా సినిమా నుంచి ఫస్టు టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో వర్షంలో రాజశేఖర్ పై ఒక గ్యాంగ్ చేసే దాడిని చూపించారు. ఈ టీజర్లో ఒకేఒక్క యాక్షన్ సీన్ కన్పిస్తుంది. రాజశేఖర్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే యాక్షన్ ఈ సినిమాలో ఉందని టీజర్ చూస్తుంటేనే తెలుస్తోంది. రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంతకుముందు అభిమానులు “‘యాంగ్రీ యంగ్ మేన్”గా పిలుచుకునే రాజశేఖర్ ఈ సినిమాతో “యాంగ్రీ స్టార్”గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Related posts