“స్వచ్ఛ భారత్” కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో శనివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని చీపుర్లు పట్టి ప్రాంగణంలో చెత్త ఊడ్చారు. హేమమాలిని ఊడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కొందరు నెటిజన్స్ సెటైర్స్ వేశారు. కాస్ట్‌లీ రోడ్ హర్ట్ కాకుండా హేమ మాలిని రోడ్‌ని బాగా ఊడుస్తారు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో హేమమాలిని చీపురు కనీసం రోడ్డుకు తగలకుండా ఊడ్చారు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి. ఇక మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ చేపట్టిన సంగతి తెలిసిందే.
Hema Malini trying not to Hurt the costly Road. #Respect 😭😂 pic.twitter.com/1wVBRdHbcH
— BALA (@erbmjha) July 13, 2019


ఏపీలో అరాచక పాలన..కేంద్రం దృష్టిసారించాలి: యనమల