“డియర్ కామ్రేడ్” సినిమా ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్నారు. ఈ చిత్రం జూలై 26న రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్‌లో రష్మిక లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే నడించింది. ఓ ఇంటర్వ్యూలో ముద్దు సన్నివేశాలలో నటించడం గురించి వివరించింది. కోపం, బాధ, తరహాలోనే ముద్దు. అది కూడా ఓ ఎమోషనే. నటిగా దాన్ని కూడా పండించాలి. ముద్దు సన్నివేశాలని నటన నుండి వేరుగా చూడలేమంటూ చెప్పుకొచ్చింది రష్మిక. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్‌లో ఉంది. వరుస సినిమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఒకవైపు కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తుంది. మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.
previous post