telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మూడవ సారి బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

Nirmalasitaraman

మూడవ సారి దేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశ పెట్టనున్నారు. “కరోనా” తో కుదేలైన దేశ ఆర్దిక పరిస్థితిని చక్కబెట్టేందుకు పలు కీలక కేటాయింపులు, నిర్ణయాలు తీసుకోనున్నారు. కొన్ని రంగాలు చాలా వేగంగా ఆర్ధిక పురోగతి సాధించినా, కొన్ని రంగాలలో ఇప్పటికీ ఆర్ధిక ఇబ్బందులతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు సతమతమౌతున్నాయి. “కరోనా” కారణంగా బాగా పడిపోయాయి సంప్రదాయ పొదుపు చర్యలు. దీర్ఘకాల పొదుపు పధకాల పట్ల విముఖతను తొలగించేందుకు ప్రోత్సాహాకాలు ఉండచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. “ఆన్ లైన్” విద్య ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు భారీ కేటాయింపులుండవచ్చని… సాంకేతిక విద్యను గ్రామీణ ప్రాంతాలు, చిన్న, మధ్యతరగతి పట్టణాలలో పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు నిర్ణయాలుండవచ్చని తెలుస్తోంది. రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు ఉండవచ్చని… ఆరోగ్య పరిరక్షణకు పన్ను మినహాయింపు పరిమితులు మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మద్యం, పొగాకు ఉత్పత్తుల పై పన్నులు పెరిగే అవకాశం ఉందని… నైపుణ్యాభివృద్ధి లాంటి రంగాలలో మహిళలకు ప్రోత్సాహాలు, వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు పలు కీలక నిర్ణయాలు ఈ బడ్జెట్‌ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆహార నిల్వ సామర్థ్యాన్ని పెద్దఎత్తున పెంచేందుకు, దేశంలో గిడ్డంగులను పెంచే పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. “మనెరగా” (పనికి ఆహార పథకం) ను మరింత సమర్థంగా అమలు చేసేందుకు భారీ కేటాయింపులు ఉండనున్నాయి. వినియోగ సామర్థ్యాన్ని, వస్తు కొనుగోళ్లను పెంచేందుకు భారీ ప్రోత్సాహకాలు ఉండవచ్చని తెలుస్తోంది.

Related posts