telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆన్‌లైన్ లోన్‌ యాప్స్ కేసులో మరో కీలక మలుపు !

ఆన్‌లైన్ లోన్‌ యాప్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ అన్నారు. ఈ కేసులో 16మందిని అరెస్ట్ చేశామని… కీలక సూత్రదారి ల్యాంబో అలియాస్ జూబీని నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. డాక్యుమెంట్లను రూపొందించిన నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నామని… నగదు లావాదేవీలు లిపైన్‌ కంపెనీతో జరిగినట్లు గుర్తించామన్నారు. అలాగే లిపైన్‌ కంపెనీ డైరెక్టర్ పల్లె జీవన జ్యోతిని అరెస్ట్ చేశామని..నిందితులను రిమాండ్‌కు పంపామని తెలిపారు. చైనా వ్యాపారస్తులే ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లు గుర్తించామని.. తెలివిగా ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ఉండేందుకు… ఇండియాకు సంబంధించిన వ్యక్తుల పేరిట నగదు లావాదేవీలు, యాప్‌లు క్రియేట్‌ చేశారన్నారు. మొత్తం 351 మర్చంట్‌ ఖాతాలు, 205 నగదు ఖాతాలను గుర్తించామని.. ప్రతిరోజు 10 కోట్లు లావాదేవీలు జరిగినట్లు తమ విచారణలో తెలిందన్నారు. ఇప్పటి వరకూ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు 21 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిసిందని తెలిపారు. యాప్‌ల్లో పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తున్నాయి…?, నగదును కస్టమర్లకు ఏ విధంగా పంపిణీ జరుగుతుంది…?…కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న లాభాలు ఎక్కడికి చేరుతున్నాయో విచారణలో తెలుస్తాయని పేర్కొన్నారు. చైనాకు చెందిన వ్యక్తులు ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని… ఖాతాలు మాత్రం ఇండియాకు చెందిన వ్యక్తుల పేరిట నడుస్తున్నాయన్నారు.
దేశ వ్యాప్తంగా లోన్ యాప్స్ బాధితులు ఉన్నారని.. ఈ కేసు విషయంలో పలు రాష్ట్రాల పోలీసులు తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. కాల్ సెంటర్లను నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా విభజించారని… సౌత్ కాల్ సెంటర్ బెంగళూరు, హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్నాయన్నారు. అలాగే నార్త్ ఇండియా కాల్ సెంటర్లు గుర్‌గావ్, ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయని తెలిపారు.

Related posts