telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అసభ్యంగా ప్రవర్తించినందుకు క్రికెటర్ చెంప పగలగొట్టిన ప్రియమణి…?

Priyamani

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్)లో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినందుకు దక్షిణాది హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఓ క్రికెటర్ చెంప‌ పగల కొట్టింది అనే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై న‌టి ప్రియ‌మ‌ణి వివ‌ర‌ణ ఇస్తూ.. “ఓ వ్య‌క్తి మొబైల్ ఫోన్ దొంగిలించి నాతో ప్రాంక్ చేస్తున్నాడు. ర‌క‌ర‌కాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ త‌ర్వాత ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్వయంగా నా హోటల్ రూంకు వచ్చి కలిశాడు. నాతో బిహేవ్ చేసిన విధానం సరిగా లేదని చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవం లాంటిదే. అయితే తాను అతడిని కొట్టానని వచ్చిన వార్తల్లో నిజం లేదు” అని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. ఇంత‌కీ త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఆ క్రికెట‌ర్ పేరేంటి అన్న ప్ర‌శ్న‌కు మాత్రం ప్రియ‌మ‌ణి స‌మాధానం ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం సినిమాలు, టీవీ షోలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ బిజీగా ఉన్నారు.

Related posts