తాజాగా, రామ్ చరణ్ భార్య ఉపాసన దాదా సాహెబ్ పాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక స్పృహ వంటి అంశాల్లో ఆమె చేసిన సేవకు గానూ ఉపాసనను ఈ అవార్డు వరించింది. దీంతో భార్యపై హీరో రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈరోజు ఫేస్ బుక్ లో రామ్ చరణ్ స్పందిస్తూ..’ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా’ అంటూ ఆప్యాయంగా పోస్ట్ చేశాడు. ఈ అవార్డు తనకు రావడంపై ఉపాసన స్పందిస్తూ..‘నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు.