telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విరాట పర్వం నుంచి రానా ఫస్ట్ గ్లింప్స్…

రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “విరాటపర్వం 1992”. “నీది నాది ఒకే కథ” ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక ప‌రిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెర‌కెక్కించ‌నున్నాడు. పీరియాడిక్ సోష‌ల్ డ్రామాగా రూపొందనుంది. వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌. అయితే.. తాజాగా హీరో రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ విడుదల చేశారు. ఈ వీడియోలో దగ్గుపాటి రానా అద్భుతంగా కనిపిస్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నది.

Related posts