telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై టాస్క్ ఫోర్స్ దాడులు… చరణ్ కు సమస్యలు

Syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. అయితే త‌న సినిమాని విస్తృతంగా ప్ర‌మోట్ చేసుకుంటున్న చిరు రీసెంట్‌గా ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌లిసి సైరా సినిమా చూడాల‌ని కోరారు. ఇక బుధ‌వారం ఢిల్లీ వెళ్లిన చిరు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడిని క‌లిసి ఆయ‌న ఇంట్లో సైరా స్పెష‌ల్ షో ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఆయ‌న‌తో క‌లిసి సినిమాని చూసారు చిరు. ప్రస్తుతం ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అదే కేంద్రప్రభుత్వానికి చెందిన జీఎస్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలో ప్రదర్శింప బడుతున్న అనేక ‘సైరా’ ధియేటర్స్ ను చెక్ చేసి ‘సైరా’ కలక్షన్స్ యదార్ధమేనా తమకు రావలసిన జీఎస్టీ సరిగ్గా జమ అయిందా లేదా అన్న విషయం లోతుగా విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులు కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే జరిగాయా లేదంటే ‘సైరా’ ప్రదర్శిస్తున్న అన్ని ధియేటర్లలోను జరిగాయా అన్న విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తమకు రావలసిన జీఎస్టీ విషయమై చాల గట్టిగా వసూలు చేస్తోంది. వాస్తవానికి సినిమా థియేటర్ల యాజమానులు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. సమాచారం మేరకు ‘సైరా’ రైట్స్ అమ్మకం జరిగే సమయంలో బయ్యర్లు చేసుకున్న ఒప్పందం ప్రకారం జీఎస్టీ మొత్తాన్ని కూడా నిర్మాత రామ్ చరణ్ చెల్లిస్తానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ వచ్చిన తర్వాత బయ్యర్లు జీఎస్టీని చెల్లించడానికి ఒప్పుకున్నారట. ‘సైరా’ కు తెలుగు రాష్ట్రాలలో కూడ ఇంకా బ్రేక్ ఈవెన్ రాకపోవడంతో ఈ మొత్తాన్ని చరణ్ చెల్లించ వలసి ఉంటుందని అంటున్నారు.

Related posts