telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లిపై .. మరోసారి స్పష్టత ఇచ్చిన ప్రభాస్..

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తాను ఎవరినైనా ప్రేమించినా లేదా తన వివాహం నిశ్చయమైనా ముందు అభిమానులకే చెబుతానని, ఈ విషయంలో దాచి పెట్టేది ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తాను నటించిన ‘సాహో’ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆయన, ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనపై ఎన్నో ప్రేమకథలు వచ్చాయని, వాటిపై తాను ఇప్పటికే చాలా సందర్భాల్లో స్పందించానని, అయినా వార్తలు ఆగడం లేదని అన్నాడు.

లవ్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ విషయాన్ని ఖచ్చితంగా అందరితో చెబుతానని తెలిపాడు. తన ఫ్యాన్స్ కు ఎంతో ఓపికని, రెండేళ్ల పాటు సినిమా రాకున్నా ప్రేమతో ఎదురు చూసి డైహార్డ్ ఫాన్స్ అయిపోయారని అన్నారు. వారి ప్రేమను చూస్తుంటే, ఓ వైపు గర్వంగాను, మరోవైపు భయంగానూ అనిపిస్తుంటుందని, వారి నమ్మకాన్ని, ప్రేమను నిలుపుకునేందుకు మరింత జాగ్రత్తగా ఉంటానని అన్నారు

Related posts