telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

‘బాంబ్’ తుఫానుతో.. అతలాకుతలం అవుతున్న అమెరికా(డెన్వర్).. !

america facing huge issues with bomb hurricane

అమెరికా వాసులను తుఫానులు .. వణికిస్తున్నాయి. తాజా తుఫాను బాంబ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో డెన్వర్ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. దీని ప్రభావంతో దాదాపు 1,339 విమాన సేవలను నిలిపివేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు, వ్యాపార సంస్థలకు సెలవు దినాలు ప్రకటించారు. కొలరాడో, ఓమ్నిన్గ్, నెబ్రాస్కా, డకోటా రాష్ట్రాలలో మంచు వర్షం తీవ్రంగా ఉంది. ప్రజలు ఎక్కడకు ప్రయాణాలు పెట్టుకోరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది అక్కడి ప్రభుత్వం.

గత 24 గంటలలో 23 మిల్లీబార్ల ఒత్తిడితో మంచు కురవడంతో డెన్వర్ లోనే 110 వరకు రహదారి ప్రమాదాలు జరిగినట్టు సమాచారం. ప్రజలు తగిన జాగర్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. డెన్వర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచు తీవ్రంగా పేరుకుపోయిందని విమానాశ్రయం ప్రతినిధి వెల్లడించారు. ఈ తుఫాను వలన దాదాపు లక్షన్నర మంది చీకట్లో మగ్గుతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా కష్టసాధ్యంగా ఉందని అధికారులు పేర్కొనడం విశేషం.

Related posts