శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన జరిగింది. అయినవారినే భారంగా భావించే ఈ రోజుల్లో అనాధ శవాన్ని ఆత్మ బంధువులా ఓ మహిళా ఎస్సై తన భుజాలపై మోసుకెళ్లింది. అసలు వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవి కొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. అయితే.. విషయం తెలుసుకున్న ఎస్సై శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. లలిత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల సాయంతో మృతదేహాన్ని ఎస్సై శిరీష తన భుజం పై మోసుకుంటూ సుమారు 2 కిమీ తీసుకెళ్లి సమీపంలోని రోడ్డు పైకి చేర్చారు. అనంతరం మృతదేహాన్ని ట్రస్ట్ సభ్యులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఓ మహిళా ఎస్సై మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్లడాన్ని చూసిన పలువురు ఆమెను అభినందిస్తున్నారు. అంతేకాదు.. ఏపీ డీజీపీ సవాంగ్ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
previous post
next post
ఆ విషయాల్లో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది: బీజేపీ