telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేటినుంచి అమెజాన్‌ ప్రైమ్‌ లో “సైరా”

syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. చిత్రంలో చిరు, అమితాబ్ బ‌చ్చ‌న్, త‌మ‌న్నా, న‌య‌న‌తార‌ల‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తి బాబు, నిహారిక త‌మ పాత్ర‌ల‌కి చక్క‌గా న్యాయం చేశారు. దేశ‌భ‌క్తిని ఇనుమ‌డించే ఈ సినిమాని క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు సురేందర్‌రెడ్డి. రేనాటి వీరుడు “సైరా న‌ర‌సింహారెడ్డి” జీవిత నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌గా, మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. యుద్ద స‌న్నివేశాలు, వీరోచిత ఘ‌ట్టాలు, భారీ డైలాగులు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని దోచుకున్నాయి. రీసెంట్‌గా ఈ చిత్రం 34 సెంట‌ర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ పీరియాడిక‌ల్ మూవీని నేటి (న‌వంబ‌ర్ 21) నుంచి ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. సైరా తమిళ్‌, తెలుగు, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు . హిందీ వెర్షన్‌ త్వరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.

Related posts