telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎవరైనా పొగిడితే… నేలపై పడుకుంటా : మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi

సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘మా’ను సరిదిద్దడంతో పాటు.. ఇటీవల విరివిగా చిన్న హీరోల ఆడియో ఫంక్షన్లకు వెళుతూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు చిరంజీవి. ఆ సమయంలో చిరంజీవిపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రశంసలు వచ్చిన ప్రతిసారి ఆయన ఇంటికి వెళ్లి నేలపై పడుకుంటారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఎవరైనా పొగిడితే సంబరపడిపోను. సినిమా వేడుకల్లో నన్ను పొగిడినప్పుడు ఇంటికి వెళ్లగానే నేలపై పడుకుంటా. ఎందుకంటే గర్వం రాకూడదు కదా. నా మూవీలు విజయం సాధించడం వెనుక నా ఒక్కడి గొప్పదనం మాత్రమే ఉండదు. దాని వెనుక ఎంతో మంది కళాకారులు, శ్రామికుల కష్టం ఉందని భావిస్తాను. ఇక సినిమా ఫెయిల్ అయినప్పుడు విమర్శలు వస్తే.. టీమ్ మొత్తం ఫెయిల్ అయ్యామనే నమ్ముతా. ఈ రెండు విషయాల్లో నేను నిజాయితీగా ఉంటాను కాబట్టే.. సక్సెస్, ఫెయిల్యూర్‌ను నేను ఒకేలా తీసుకుంటా’’ అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

Related posts