telugu navyamedia
సినిమా వార్తలు

“దాక్కో దాక్కో మేక” వ‌చ్చేసింది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంత‌గానో ఆతృతగా ఎదురు చూస్తున్న “దాక్కో దాక్కో మేక” సాంగ్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేప‌థ్యంలో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప : ది రైజ్ పార్ట్-1 ఈ మూవీని దర్శకుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి.

Pushpa Movie: Daakko Daakko Meka Lyrical Song Released - Sakshi

తాజాగా మేకర్స్ ఈ మోస్ట్ అవైటెడ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‏తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక’ అంటూ సాగే లిరికల్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో బన్ని మాస్‌లుక్‌తో ఇరగదీశాడు. మునుపెన్నడు లేని విధంగా సరికొత్తగా స్టైలిష్‌ స్టార్‌ రెచ్చిపోయాడు.

అన్నింటి కంటే కోరస్ సాంగ్, క్రేజీ ట్యూన్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ ను సింగర్ శివమ్ ఆలపించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సాంగ్ చివర్లో అల్లు అర్జున్ “తగ్గేదే లే” డైలాగ్ చెప్పడం ఆయన అభిమానులను హుషారెత్తిస్తోంది.
ఈ సాంగ్ ను ఒకేసారి 5 భాషల్లో విడుదల చేశారు.

Allu Arjun's Pushpa Movie First Single Released

ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన నటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. రెండవ భాగం 2022లో రిలీజ్ అవుతుంది. కాగా..లీకైన ఈ పాట‌ దేవిశ్రీప్రసాద్ పాడిన వెర్షన్. మెయిన్ సాంగ్ ను మాత్రం సింగర్ శివమ్ తో పాడించారు.

Related posts