telugu navyamedia
ఆరోగ్యం

ఆహారం మానేస్తెనే బరువు తగ్గుతారా?

అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గడానికి డైటింగ్‌లు చేసి, గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేసి నానాతంటాలు పడుతుంటారు. అయితే నిపుణులు జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా బరువును నియంత్రణలో పెట్టుకోవచ్చు అంటున్నారు. తగినంత నీటిని తాగకపోవడం వల్ల రోగనిరోధకత తగ్గిపోతుంది. దాంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే రోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. చాలా మంది మహిళలు ఆహారం మిగిలిపోతుందనో లేదా పాడవుతుందనో, ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. దీని కారణంగా తెలియకుండానే క్రమక్రమంగా బరువు పెరుగుతారు. మిగిలితే మరో రకంగా ఉపయోగించండి. మితంగా రోజులో నాలుగైదుసార్లు ఆహారం తీసుకోండి.

రోజూ సరైన సమయానికి మనం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మనకు రోగాలు తక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ కూడా ఆరోగ్యకరమైనది అయితే మంచిది. రాత్రి సమయంలో పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల బరువు బాగా తగ్గుతారట. గ్రీన్ టీ మీ మెటబాలిజాన్ని పెంచుతుంది. దీని వల్ల కేవలం లావు మాత్రమే కాదు.. క్యాన్సర్ వంటి సమస్యలు కూడా దూరంగా ఉంటాయట. అయితే గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి మరీ ఎక్కువగా తాగడం వల్ల చెడు ప్రభావాలు ఎదురవుతాయి. 

ఆరోగ్యంతోపాటు బరువు నియంత్రణలో ఉండాలంటే చక్కెరను పూర్తిగా వదిలేయాలి. ప్రత్యామ్నాయంగా బెల్లం/తేనెలను వాడచ్చు. ఇవి రుచిని ఇస్తాయి. కెలొరీలను తగ్గించి బరువునూ నియంత్రణలో ఉంచుతాయి. బేకరీ, నూనెలో వేయించిన పదార్థాలను దూరం పెట్టండి. వాటి స్థానంలో తాజా సలాడ్లకు తీసుకోవాలి. వీటితో ఆరోగ్యంతోపాటు మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. భారమైన, కఠిన వ్యాయామాలకు బదులు యోగా, నడక లాంటివి రోజూ ఓ అరగంటన్నా చేయండి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. సరిపడా నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రస్తుత గజిబిజి జీవితంలో చాలామంది నిద్ర విషయంలో రాజీ పడుతున్నారు. ఇలా చేస్తే అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. బరువూ పెరుగుతారు. కాబట్టి రోజూ ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి. మంచి నిద్రతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

Related posts