telugu navyamedia
ఆరోగ్యం

కరోనా ధర్డ్ వేవ్ భయం.. పిల్లల ఫుడ్‌ మెనూ.. నిపుణుల సూచన

భారత దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్ భయం పుట్టిస్తోంది. ముఖ్యంలో మూడో వేవ్ మాత్రం చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతోందంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి సహేతుకమైన ఆధారాలు ఎక్కడా లేవు. కానీ, ప్రజల్లో మాత్రం భయం అలాగే ఉంది. కరోనా ధర్డ్ వేవ్‌ను రాకుండా నిలువరించేందుకు, ఒకవేళ ఎఫెక్ట్ చూపించినా.. దాని ప్రభావం తక్కువగా ఉండేలా చూసేందుకు పలు రాష్ట్రాలు తమకు తోచిన విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ధర్డ్ వేవ్ గురించి ముందస్తుగా ఓ ప్లాన్ వేసింది. ముఖ్యంగా ధర్డ్ వేవ్ ప్రభావం పిల్లల మీద పడకుండా వారికి ప్రత్యేక మైన ఆహార నియమాలను సూచించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆరోగ్య శాఖ నిపుణులు రెండు రకాలైన మెనూలను పిల్లల కోసం రూపొందించారు. రెండు మెనూ చార్ట్స్ సిద్ధం చేశారు. అందులో 1 నుంచి 5 సంవత్సరాల లోపు వారికి ఒక చార్ట్, 5 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న వారికి మరో చార్ట్ రెడీ చేశారు. ఆ మెనూల్లో బ్రెడ్, గుడ్లు, పండ్లు, పాలు, అన్నం, పప్పు, కూరగాయలు, ఫిష్ లాంటివి ఉన్నాయి. అయితే, 5 ఏళ్ల వయసున్న వారికంటే 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసున్న వారికి మాత్రం కొంచెం ఎక్కువ మోతాదులో పైన పేర్కొన్న ఆహారాన్ని అందించాలని నిపుణులు చెప్పారు.

Related posts