telugu navyamedia
ఆరోగ్యం

ఎండిన కొబ్బ‌రితో ఆరోగ్యం మీ సొంతం.

సాధారణంగా మన ఇళ్లలో ఎండు కొబ్బరిని కూర‌ల్లో ఉపయోగిస్తుంటం. దీంతో వంట రుచిని పెంచడంలోనూ ఎండు కొబ్బరి ప్రధానంగా పనిచేస్తుంది. కానీ ఈ ఎండుకొబ్బరిలో అనేక పోషకాలున్నాయన్న సంగ‌తి అంద‌రికీ తెలియ‌దు..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండిన కొబ్బ‌రిలో పైబ‌ర్, మాంగ‌నీస్ మ‌రియు స‌లీనియం వంటి అనేక ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. దీంతో శరీరంలో రక్త ప్రవాహాన్ని సరిగ్గా ఉంచుతుంది.

పొడి కొబ్బ‌రి తిన‌డం వ‌ల‌న జ్ఞాప‌క‌శ‌క్తి  పెరిగి  మెద‌డు ప‌ని తీరును వృద్ది చెందుతుంది. ఆహారంలో ఎండు కొబ్బ‌రి ఉప‌యోగించ‌డం ద్వారా అల్జీమర్స్ అనే భ‌యంక‌ర‌మైన వ్యాధిని నివారించడానికి సహయపడుతుందని వైధ్యులు చెబుతున్నారు.

కొబ్బరిని ఆహారంలో చేర్చడం వలన ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను రాకుండా నివారిస్తుంది. అంతేకాకుండా… చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

* ఎండిన కొబ్బ‌రి శ‌రీరంలో ర‌క్త ప్ర‌వాహాన్ని స‌రిగ్గా ఉంచుతుంది.
* ఐర‌న్ లోపాన్ని త‌గ్గిస్తుంది.
* ఆర్థ‌రైటిస్, బోలు ఎముక‌ల వ్యాధి వంటి స‌మ‌స్య‌లు రాకుండా నివారిస్తుంది.
* ఎండిన కొబ్బ‌రిలోని ప్రోటీన్స్‌, విట‌మిన్స్ ఐర‌న్‌, కాల్షియం మాంగ‌నీస్‌, సెలీనియం పోష‌కాలు రోగ నిరోధ‌క శ‌క్తిని బలోపేతం చేస్తాయి.అంతేకాకుండా.. శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

 

Related posts