telugu navyamedia
ఆరోగ్యం

భార‌త్‌లోకి ఎంట‌రైన‌ ఒమిక్రాన్‌..

భ‌య‌ప‌డిందే జ‌రిగింది.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. క‌ర్ణాట‌క‌లోని రెండు ఒమిక్రాన్‌ కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్ స్వీక్వెనింగ్ పరీక్షలో నిర్థారించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ వెల్ల‌డించారు.

ఒమిక్రాన్‌ బారినపడ్డవారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన చెప్పారు. భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కేసులలో ఇవి మొదటి కేసులు.

దీంతో ఈ వేరియెంట్‌ మనదేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉందని, కాబ‌ట్టి ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. భారత ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కఠిన చర్యలు తీసుకుంది.

Coronavirus: CDC urges Americans to avoid travel to France, Israel and Thailand - as it happened | Financial Times

కాగా.. ప్ర‌పంచానికి అతిపెద్ద ముప్పుగా ఒమిక్రాన్ అవ‌త‌రించ‌బోతుంద‌ని, కాబ‌ట్టి దేశాల‌న్నీ కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డ‌బ్ల్యూహెచ్ ఓ రెండురోజులు క్రితం వార్నింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. గ‌తంలో కూడా క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు డ‌బ్ల్యూహెచ్ ఓ వార్నింగ్ ఇవ్వ‌లేదు..కానీ ఇప్పుడిచ్చిందంటే ఎంత ప్ర‌మాద‌క‌ర‌మే గుర్తించాలి ప్ర‌జ‌లు.

దాదాపు 10 రోజులు క్రిత‌మే భార‌త్‌లోకి ఎంట్రీ అయిన‌ట్లు అంచ‌నా వేశారు. సౌతాఫ్రికాలో నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల‌ను డైరెక్ట్‌గా టెస్ట్‌లు చేయ‌డానికి పంపించిన త‌రువాత ఇద్ద‌రికి పాజిటివ్ వ‌చ్చింది. అయితే అది క‌రోనా కాదు..ఒమిక్రాన్ వైర‌స్ సోకిన‌ట్టు అనేది ఈవాళ నిర్ధారించ‌డం జ‌రిగింది.

అంద‌రూ భౌతిక దూరం పాటించి , మాస్క్‌లు ధ‌రించి, సానిటైజ‌ర్ రాసుకోవ‌డం చేయాల‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ కు ఎలాంటి జాగ్రత్త‌లు పాటించారో అలాగే ఇప్పుడు కూడా అదే జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

Related posts