telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉభయసభల్లో తెలంగాణ లొల్లి..

రైతులు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్రసమితి ఎంపీలు ఢిల్లీలో గళాన్ని విన్పించే ప్రయత్నాలు చేశారు. వరుసగా మూడు రోజులపాటు లోక్ సభ, రాజ్య సభల్లో సభ్యులు ఫ్లకార్డులను చేతపట్టుకుని నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

లోక్ సభలో ధాన్యం విషయమై చర్చించేందుకు సముచిత స్థానం కల్పిస్తామని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నప్పటికీ… టీఆర్ఎస్ ఎంపీలు రైతుల్నిఆదుకోండి, ధాన్యం కొనండనే నినాదాలు చేస్తూ విసుగెత్తించే ప్రయత్నం చేశారు. రాజ్యసభలోనూ సభ్యులు ప్లకార్డులను ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నినాదాలు చేసే టీఆర్ఎస్ సభ్యుల్ని వారించే ప్రయత్నంచేశారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం సానుకూలంగా వ్యవరిస్తోందని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నప్పటికీ… తెలంగాణ రాష్ట్రసమితి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు తెలంగాణ రైతులకోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతున్నారనే విషయాన్ని రైతులు గుర్తించాలని ప్రయత్నిస్తున్నారు.

ధాన్యం కొనుగోలుచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనను వ్యతిరేకిస్తూ… రైతుల్ని మోసగిస్తున్నారని ఢిల్లీలో ఎంపీలు తమ మనోగతాన్ని వెల్లడించారు. తెలంగాణ రైతులనుంచి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించారు.

Related posts