telugu navyamedia
ఆరోగ్యం

భారత్‌‌లో త‌గ్గిన కరోనా కేసులు..కొత్తగా ఎన్ని కేసులంటే?

దేశంలో క‌రోనా​ థ‌ర్డ్ వేవ్‌ కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి క‌రోనా కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. ఇప్పుడు కాస్త కేసులు సంఖ్య తగ్గింది. నిన్న‌టితో పోల్చితే తాజాగా నమోదైన కేసుల్లో తగ్గుదల కనిపించింది.

భారత్‌‌లో గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,55,874 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు 50,190 తక్కువ కేసులు న‌మోద‌య్యాయి

అయితే, గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 614 మంది క‌రోనాతో మృతి చెంద‌గా..2,67,753 మంది కొలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. ఇక దేశంలో ప్ర‌స్తుతం 22,36,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

పాజిటివిటీ రేటు కూడా 20.75% నుండి 15.52%కి తగ్గింది. ఇక కరోనా రికవరీ రేటు.. 93.15 శాతం, మరణాల రేటు 1.23 శాతం, యాక్టివ్ కేసుల శాతం 5.62 శాతంగా ఉంది.

మ‌రోవైపు ..భారత్​లో వాక్సినేష‌న్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.. సోమవారం ఒక్కరోజే 62,29,956 డోసులు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,92,09,308కు చేరింది

Related posts