telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కరోనా వైరస్ విలయతాండవం… ఈ సమయంలో సర్జరీ చేయించుకోవచ్చా ?

Surgery

కరోనా వైరస్ వల్ల ఇంటి నుంచి బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. అయితే కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, వాల్వ్ రీప్లేస్మెంట్/రిపెయిర్ వంటి ఎలెక్టివ్ సర్జరీలు చేయించుకోవాల్సిన వారు కరోనా సోకుతుందేమో అన్న భయంతో హాస్పిటల్ కి వెళ్ళడానికి సందేహిస్తున్నారు. ఆ సందేహమే ప్రస్తుతం ప్రాణాంతకమౌతోందంటున్నారు నిపుణులు. ఇలా వెనకడుగు వేస్తున్న వారి ఆరోగ్యం ఇంకా దిగజారుతోందని చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తం గా అందరూ కరోనా వైరస్ మీదే ఫోకస్ చేసి ఉండటం తో ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయట. మరీ ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్‌తో చనిపోతున్న వారి శాతం బాగా పెరిగిందట. వీరిలో చాలా మంది కరోనా సోకుతుందేమోనన్న భయంతో హాస్పిటల్‌కి సకాలం లో వెళ్ళని వారే. కరోనా వైరస్ సోకుతుందేమో అన్న భయం కంటే అవసరమైన వైద్య సహాయం పొందకపోవటం ఇంకా ప్రమాద కారకమని వీరు హెచ్చరిస్తున్నారు. చాలా హాస్పిటల్స్ లో ఇప్పుడు ఎలెక్టివ్ సర్జరీలు చేస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలతో వారానికి మూడు నాలుగు సర్జరీలు చేస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే, కొవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం పేషెంట్స్ కి హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఆ జాగ్రత్తలేమిటో చూడండి.

1. పేషెంట్స్, విజిటర్స్ కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
2. హాస్పిటల్ లో పేషెంట్ కి సహాయం అందించే ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించాలి.
3. పేషెంట్స్, వారితో పాటూ వచ్చే వారికి హాండ్ శానిటైజర్స్ ఇవ్వాలి. వీరందరూ భౌతిక దూరం పాటించాలి.
4. ఎక్కువ మంది తిరిగే ప్రదేశాలని రెగ్యులర్ గా క్లీన్ చేయడం, డిసింఫెక్ట్ చేయడం కంపల్సరీ.
5. మొత్తం మెడికల్ ఎక్విప్మెంట్ ని డిసింఫెక్ట్ చేయాలి.
6. పేషెంట్స్ సంగతి చూసే మెడికల్ సిబ్బంది అందరికీ పీపీయీ తప్పనిసరి.

Related posts