బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును విచారిస్తున్న సంధర్భంలో ఆమెకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్టు తేలింది. దాంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కంగనా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ “ఈ కేసులో రియాను బలిపశువును చేయబోతున్నారని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. ఆమె చిన్నపాటి గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసం మగాళ్లతో స్నేహం చేసే మహిళ) కావొచ్చు, డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చు. విచారణలో భాగంగా ఆమె అసలు రహస్యాలు బయటపెట్టాలి. సుశాంత్ మరణం వెనకున్న మాస్టర్ మైండ్స్ పేర్లు చెప్పాలి. అతని కెరీర్‌ను నాశనం చేసింది ఎవరు? అతని సినిమాలను లాగేసుకుందెవరు? అతనికి డ్రగ్స్ ఇచ్చిందెవరు? ఇప్పుడు ఆమె అవన్నీ బయపెట్టాలి” అని కంగనా పేర్కొంది. ఇక డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే సుశాంత్ మేనేజర్ శామ్యూల్, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ను అరెస్ట్ చేసింది.
previous post
next post