telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టైగ‌ర్ ష్రాఫ్ డాన్స్ కు నెటిజన్లు ఫిదా

Tiger

బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ తాజాగా డ్యాన్స్‌తో తో ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. ఈ వీడియోతోపాటు బీటీఎస్‌తో ప్రేమలో ఉన్న వారు ఎవరైన డైనమైట్ సాంగ్‌ని ప్రయత్నించండి అంటూ టైగర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఫిట్‌నెస్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఈ కండలవీరుడి మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఆయ‌న ప్ర‌స్తుతం “హీరో పంతి 2” చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆ త‌ర్వాత హాలీవుడ్ హీరో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాంబో’ రీమేక్‌ కూడా చేయబోతున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ ఇప్పటికే సెట్లోకి వెళ్లాల్సి ఉండగా, కరోనా ప్రభావంతో 2021 చివ‌ర్లో సెట్స్ మీద‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కాగా టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు క‌స‌ర‌త్తులు చేస్తూ ఉంటారు. నెల‌ల త‌ర‌బ‌డి విరామం త‌ర్వాత‌ షూటింగ్స్ మ‌ళ్లీ ప్రారంభ‌వ‌మ‌వుతుండటంతో ఎక్స్‌ట్రా డోసులో వ్యాయామం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే టైగర్ ష్రాఫ్ తరచు విబిన్నమైన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాడు.

 

View this post on Instagram

 

Anyone else in love with bts’ new single! #dynamite @bts.bighitofficial @paresshss @yashjain_14 @_anjalli_

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

Related posts